కాస్త బొద్దుగా కనిపించినా.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మనసులు దోచుకుంది మళయాల కుట్టి అను ఇమ్మాన్యూయెల్. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అంతా అనుకున్నారు. ఈ అమ్మడు అందాలకు అంతా ఫిదా అవ్వాల్సిందే. మరి ఇంత అందం, అభినయం ఉన్న ఈ పిల్లకు టాలీవుడ్ లో మొదట్లో బాగానే సినిమాలు వచ్చాయి.
కానీ వాటిల్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లు రావడంతో.. అవకాశాలు పెద్దగా తలుపుతట్టలేదు. దీంతో అటు కోలీవుడ్, మళయాల సినిమాల్లో బాగానే నటిస్తూ బిజీగా మారింది. ఇక ఇప్పుడు పెద్దగా సినిమాలు రావట్లేదని తెలుస్తోంది.
ఈ గ్యాప్‌లో తన ఫాలోయింగ్ తగ్గకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తోంది. నిత్యం లేటెస్టు ఘాటు అందాలతో మత్తెక్కిస్తోంది. పొట్టి డ్రెస్సులో ఫోజులిస్తూ ఇరగదీస్తోంది. ఈమె ఏ ఫొటో పెట్టినా వేలల్లో లైకులు వస్తున్నాయి. ఇక ఈమె లేటెస్టుగా పెట్టిన ఫొటోలు చెక్కర్లు కొడుతున్నాయి. మీరు కూడా చూసేయండి.