తెలంగాణలో ఇప్పుడు కరోనా ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ట్రీట్‌మెంట్ ను పేదోళ్లకు ఉచితంగా అందించేందుకు ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ప్రతిపక్షాలు, ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా టీఆర్ ఎస్‌ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా మొన్న ఆయుష్మాన్ భారత్‌కు ఓకే చెప్పింది.
ఇక్కడే కేసీఆర్ తప్పటడుగు వేశారా అని అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని అమలు చేసుంటే కేసీఆర్‌కు పేరు వచ్చేది. కానీ ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వానిది. మరి ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఆయుష్మాన్‌కు ఎందుకు జై కొట్టినట్టు.
అసలు అవకాశం కోసం ఎదరుచూస్తున్న బీజేపీ.. ఎప్పుడైతే ఆయుష్మాన్ భారత్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అప్పటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ తమ పుణ్యమే అని, కేంద్ర తరుఫున పేదలకు ఉచిత వైద్యం అందిస్తామంటూ చెప్పుకుంటోంది. తమ పార్టీ పేదల పార్టీ అని, ఎప్పటి నుంచో చెప్తున్నా వినకుండా ఇప్పుడైనా అమలు చేశారంటూ కేసీఆర్‌పై విమర్శలు చేస్తోంది. మరి ఆయుష్మాన్ భారత్ కింద 26లక్షల మందికి మేలు జరిగితే కేసీఆర్‌కు అది మైనస్ అవుతుందా. చూడాలి ఏం జరుగుతుందో.