బ్రేకింగ్:రఘురామను కొట్టారని అభిప్రాయపడిన సుప్రీం కోర్ట్

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో ఇప్పుడు సి ఐ డీ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సుప్రీం కోర్ట్ తీర్పు కాపీని సుప్రీం కోర్ట్ విడుదల చేసింది. కస్టడీలో రఘురామకృష్ణంరాజు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించి ఉండవచ్చని అభిప్రాయ పడింది సుప్రీం కోర్ట్. రఘు రామ పాదాలకు గాయాలు, ఎముక కాలి ఎముక విరిగినట్లు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు అని తీర్పులో సుప్రీం పేర్కొంది.

పది రోజుల్లోగా లక్ష సొంత పూచీకత్తుపై బెయిల్ పై విడుదల కావచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడవద్దు అని సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది. ఇక రఘురామ తన గాయాలను కూడా మీడియా కు చూపించవద్దు అని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news