ఈ కరోనా సమయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా…? IVF ట్రీట్మెంట్ కి వెళ్లే కపుల్స్ ఈ టిప్స్ ని అనుసరించడం..!

-

కరోనా మహమ్మారి కారణంగా ఎందరో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి మహమ్మారి సమయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే నిజంగా కష్టం. ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లేదా ఐవిఎఫ్ నిజంగా చాలెంజింగ్ అనే చెప్పాలి. చాలా మందిలో భయం కూడా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లడం, చెకప్ చేయించుకోవడం వంటివన్నీ కూడా సమస్యే.

ప్రెగ్నెన్సీ వాళ్లకి కూడా కరోనా సోకే అవకాశం ఉంది. అయితే ఫీటస్ కి కరోనా ప్రభావం పడుతుంది అన్న డేటా లేదు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కరోనా కారణంగా మిస్ క్యారేజ్ ఇలాంటి సమస్యలు ఏమి రావు. అదే విధంగా బర్త్ డిఫెక్ట్స్ కూడా ఉండవు. కరోనా వాక్సినేషన్ చాలా ముఖ్యం. ప్రెగ్నెంట్ అవ్వాలంటే ముందుగా మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని యుఎస్ స్టడీ చెపుతోంది.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఎటువంటి ఆలస్యం మీరు చేయక్కర్లేదు. IVF ట్రీట్మెంట్ ని ప్లాన్ చేసుకోవడం అనేది నూరు శాతం మీ ఇష్టం. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కి ఎటువంటి రూల్స్ అనేవి లేవు.

ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కోసం కపుల్స్ కి కొన్ని టిప్స్:

ఎవరైతే ట్రీట్మెంట్ కి వెళ్తున్నారో వాళ్లు పాజిటివ్ గా ఉండాలి.
ఆరోగ్యంగా, శాంతంగా, ఎమోషనల్ బాలెన్స్డ్ గా ఉండాలి.

చేయవలసిన పనులు, చేయకూడని పనులు:

మాస్క్ పూర్తిగా ధరించాలి. మీ ముక్కు నోరు పూర్తిగా కవర్ అయ్యేటట్టు మాస్కు ధరించాలి.
మీ చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
మీరు మీ ముఖాన్ని పదేపదే చేత్తో తాకొద్దు.
సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించండి.
అనవసరంగా బయటకి వెళ్ళద్దు.
సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి.
అలానే విజిట్ కి రెగ్యులర్గా వెళ్లాలి.
మీ డాక్టర్లు చెప్పే వాటిని శ్రద్ధగా పాటించండి.
ఎక్కువగా ఆస్పత్రికి వెళ్లడం కూడా మంచిది కాదు.
ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోండి.
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.
రెగ్యులర్ గా వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి ఫాలో అవ్వండి.

ఎవరికైతే హైబీపీ, డయాబెటిస్, లివర్ సమస్యలు, కిడ్నీ లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయో వాళ్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ ని క్యాన్సల్ చేయడం మంచిది. వీలైతే ఫేస్ టు ఫేస్ కన్సల్టేషన్ కి దూరంగా ఉండి ఫోన్ ద్వారా కనుక్కుంటూ ఉండండి. మీరు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే ముందు ఆర్టిపిసిఆర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది ఇలా ఈ విధంగా ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news