నెల్లూరు: ఆయన వయసు రీత్యా పెద్ద. ఉన్నత పదవిలో కూడా ఉన్నాడు. సక్రమంగా ఉద్యోగం చేసుకోవాల్సిన ఆయనకు దురాలోచనలు కలిగాయి. తమ దగ్గర పని చేసే మహిళపై కన్నేశాడు. రోజూ ఫోన్ చేశాడు. మాట్లాడకపోతే నిద్రిపోయేవాడుకాదట. నెంబర్‌ను బ్లాక్‌లో పెట్టినా విడిచిపెట్టలేదు. కొత్త కొత్త ఫోన్ నెంబర్లతో ఫోన్ చేశాడు. అలా చాలా రోజులు గడిచాయి. ఆ పెద్దాయన వేధింపులు భరించలేక చివరకు గట్టిగా మాట్లాడింది. దాంతో సార్‌కు కోపం వచ్చింది. మాటలతో పని లేదనుకున్నాడు. తాళ్లతో కటి రూమ్‌లోకి తీసుకెళ్లాలనున్నాడు. ఈ విషయాన్ని ఫోన్‌లో ఆమెతో చెప్పిన మాటలివి. అసలు ఏంది ఈ కథ అనుకుంటున్నారా?.. అయితే నెల్లూరు జీజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. కరోనా పరీక్షలకు కాదు.. ఆస్పత్రి సూపరింటెండెంట్ కథ తెలుసుకోవడానికి?.
ప్రభాకర్.. నెల్లూరు జిల్లా జీజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే ఆస్పత్రిలో పని చేసే మహిళా సర్జన్‌పై లైంగింక వేధింపులకు దిగాడు. ఆమె వయస్సు 23 ఏళ్లు. రోజూ డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయనకు ఫోన్ చేయాలి. బయటకు వెళ్దామని చెప్పేవాడు. వేధింపులు తట్టుకోలేక ప్రభాకర్‌కు సర్జన్ ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. తన జోలికి రావొద్దని కోరారు. ఈ ఆడియో కాల్ ఇప్పుడు బయటకు లీక్ కావడంతో ప్రభాకర్ కథ వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభాకర్‌పై ప్రభుత్వం సీరియస్ అయింది. నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఇక ప్రభాకర్ వ్యవహారంపై మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.