చెన్నై: ఎయిర్‌పోర్టులో రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు గుర్తించారు. జోహాన్నెస్ బర్గ్ నుండి చెన్నై వచ్చిన ఆఫ్రికన్ మహిళలు నుంచి 10 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్‌ను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి తీసుకెళ్లేందుకు యత్నించారు.. అంతేకాదు అధికారులు గుర్తు పట్టకుండా ఘాటైన స్ప్రే కొట్టారు. ఆరోగ్యంగా వున్నప్పటికి వీల్ చెయిర్‌లో కూర్చొని బయటకు చెక్కేసే ప్రయత్నం చేశారు. కిలాడి లేడీల వ్యవహారంపై అనుమానం వచ్చి అడ్డగించిన అధికారులు వీల్ చెయిర్‌పై ఎందుకు వెళుతున్నారు అంటూ ప్రశ్నించారు.
నీరసంగా వుంది అందుకే వీల్ చెయిర్ తీసుకున్నామంటూ మరో లేడి సమాధానం ఇచ్చారు. ఇద్దరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన స్టైల్‌లో ప్రశ్నించగా కిలాడీ లేడీలు గుట్టు విప్పారు. ఇద్దరు లేడీ కిలాడీలపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరి కోసం తెచ్చారనే సమాచారాన్ని అధికారులు కూపీ లాగుతున్నారు. దీని వెనుక వున్న సూత్రధారిపై లోతుగా విచారణ చేస్తున్నారు.