పోలవరం పూర్తి, చంద్రబాబు రాజకీయ సమాధి ఒకేసారి : వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

-

టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పనులను నామినేషన్ పద్దతిపై అనుకూల కాంట్రాక్టర్లకు కట్టబెట్టి అస్తవ్యస్థం చేసిన పాపం చంద్రబాబును వెంటాడుతుందని పేర్కొన్నారు.పోలవరం పూర్తి కావడం, బాబు రాజకీయ సమాధి ఒకేసారి జరుగుతాయని… ఇంకో ఏడాది గడువుంది అంతే అని చురకలు అంటించారు. వైసీపి అధికారంలో ఉన్న రెండేళ్లలో పనులు ఎలా స్పీడందుకున్నాయో అందరికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సిఎం జగన్ కలిసిన కేంద్ర మంత్రులంతా ఆయనలోని దార్శనికతను, రాష్ట్రం అభివృద్ధి పట్ల పడుతున్న తపనను కొనియాడారని… పక్క రాష్ట్రంలో ఉండి శోకాలు పెడుతున్న పచ్చ బ్యాచికి మింగుడు పడితే ఎంత…పడకపోతే ఎంత అని మండిపడ్డారు.

జగన్నాథ రథచక్రాల పరుగు ఆగదని… వీళ్ల ఏడుపులు అర్థం చేసుకోలేనంత ప్రజలు అమాయకులేం కాదన్నారు. చంద్రబాబు సిఎంగా లేడు అనేదే వీళ్ల కుళ్లు అని..దోచుకోవడం తప్ప జనం గురించి ఏనాడు ఆలోచించని బాబుని 14 ఏళ్లు సిఎంగా నెత్తిన పెట్టుకున్నారని పేర్కొన్నారు. అదో మహా తప్పిదం అని తెలిశాక ప్రజలు ఈడ్చికొట్టారని తెలిపారు. పెద్ద నాయుడి చాప్టర్ ముగిసిందని చంద్రబాబు పై మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news