ఇంటర్నేషనల్ పిక్నిక్ డే: చరిత్ర, విశేషాలు.. మహమ్మారి సమయంలో జరుపుకునే విధానం.

-

అంతర్జాతీయ పిక్నిక్ దినోత్సవాన్ని జూన్ 18వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా బయటకు వెళ్ళి అక్కడే భోజనాలు చేసి, ఆటలు ఆడి హ్యాపీగా గడుపుతారు. ఈ ఇంటర్నేషనల్ పిక్నిక్ డే అనేది తెలుగు వాళ్ళు జరుపుకునే వన భోజనాలకు వెళ్ళడం లాంటిదే. తమ తోటివారిని కలుపుకుని ఇంటికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో రొటీన్ కి భిన్నంగా రోజంతా గడిపి మధురమైన అనుభూతులను అనుభవించడమే.

ఇంటర్నేషనల్ పిక్నిక్ డే

ఇంటర్నేషనల్ పిక్నిక్ డే చరిత్ర

నిజానికి పిక్నిక్ డే ఎలా వచ్చిందనే దానికి పెద్ద్ద చరిత్ర లేదు. కాకపోతే ఫ్రెంఛ్ విప్లవం ముగిసిన తర్వాత పిక్నిక్ డే ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పుకుంటారు. ఏది ఎలా ఉన్నా సంవత్సరానికి ఒక్కరోజు ఇంటికి దూరంగా వెళ్ళి అక్కడే భోజనాలు చేసుకుని హాయిగా ఆరగించడం ఆరోగ్యానికీ మంచిదే. ఐతే ప్రస్తుతం కోవిడ్ సమయం. ఇలాంటి సమయంలో పిక్నిక్ డేని ఎలా జరుపుకోవాలి.

పల్లెటూళ్లలో ఉండేవారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ, పట్టణాల్లో ఉండేవారు మాత్రం ఎక్కడకు వెళ్ళకపోవడమే బెటర్. లూడో, అష్టాచమ్మా వంటి ఆటలు ఆడుతూ రాత్రి పూట ఒక సినిమా ప్లాన్ చేసుకోండి. అది కూడా ప్రొజెక్టర్లో సినిమా వేసుకుని కుటుంబ సభ్యులందరూ చూస్తే బాగుంటుంది. ఇంకా ప్రత్యేకమైన వంట మరింత ఆనందంగా ఉంటుంది. ప్రతీరోజూ చేసేవాళ్ళు కాకుండా విభిన్నంగా ఉండేందుకు మీరే వంటలు చేయండి.

ఇంటి వెనకాల పెరట్లో భోజన కార్యక్రమం పెట్టుకుంటే దానికి మించినది లేదు. రాత్రిపూట క్యాండిల్స్ వెలిగించి, ఆ వెలుతురులో కుటుంబ సభ్యులందరితో భోజనం చేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news