ప్రాజెక్టులను అడ్డుకుంటాం..కేసీఆర్ అంతు చూస్తాడు : ఏపీకి తెలంగాణ మంత్రి వార్నింగ్‌

-

మహబూబ్ నగర్ జిల్లా దివిటీ పల్లిలోని కేసీఆర్ నగర్ లో 1024 రెండు పడకల ఇండ్లను రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోనే ఇండ్లు కట్టి ఉంటే… ఇపుడు ఇలా ఇండ్లు కట్టే అవసరం ఉండేదా..? వాళ్ళు ఒక రూమ్ కట్టి… ఇదే ఇల్లు అని చెప్పారని ఫైర్‌ అయ్యారు. సిఎం కేసిఆర్ ఆలోచనలకు ప్రతి రూపం.. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు అని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని..సీఎం కేసీఆర్ మంచి వారికీ మంచి వాడు… చెడు చేస్తే.. అంతు చూస్తడని ఏపీకి వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్.

పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కాకముందే.. వడ్లు.. మిల్లులు.. గోదాములు నిండేలా పండు తున్నాయని..నేడు వరి పంట సాగు ఉత్పత్తిలో దేశంలో ఎవ్వరూ చేరుకోని తీరుగా అగ్ర స్థానంలో తెలంగాణ ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహబూబ్ నగర్ ను అగ్రగామిగా ఉంచుతామని పేర్కొన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగరెడ్డి, ఖమ్మం జిల్లాల నాయకులం కలిసికట్టుగా ఉంటామని.. ఆంధ్ర ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ ఆచరణకు అనుగుణంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news