ఇద్దరూ మోసం చేస్తున్నారు… కేసీఆర్, జగన్‌పై బండి సంజయ్ ఫైర్

-

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇద్దరు సీఎంలు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో మొట్టమొదటి సమావేశంలోనే మోసం చేశారన్నారు. 68 శాతం పరిహారక ప్రాంతం ఉంటే 555 టీఎంసీల నీరు రావాల్సిందని చెప్పారు. 299కు కేసీఆర్ ఒప్పుకోవడానికి కారణం ఎంటని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ హాజరు కావాంటే ఒక్కసారైనా హాజరయ్యారా? అని బండి సంజయ్ మండిపడ్డారు. 7 సంవత్సరాలు అవుతున్నా కేసు విడ్రా చేసుకో అంటే చేసులేదని, నిన్న కాక మొన్న కేసు విడ్రా చేసుకుని కేసీఆర్ ఇప్పుడు ఎగురుతున్నారని బండి సంజయ్ విమర్శించారు.

హురాజురాబాద్ ఎన్నికల మీద కేసీఆర్ మనసు పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ నేతృత్వంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి తెలంగాణ ప్రజలు మభ్యబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చిల్లర వేషాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మీద యుద్ధం చేస్తామని కేసీఆర్ అంటున్నారని, వ్యవసాయ చట్టాల విషయలో ఇలాగే యుద్ధం అన్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత వెళ్లి ఫామ్ హౌజ్‌లో పనుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారంటే బీజేపీ వల్లనేనన్నారు. హురాజురాబాద్ ఎన్నికల కోసమే కొత్త దుకాణం తెరిచాడని సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news