కరోనా చికిత్సల ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలు ఖరారు చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం. ఈ మేరకు కోర్టుకు నివేదిక ఇచ్చిన వైద్యశాఖ… కరోనా చికిత్సల చార్జీలపై జీవో 40 జారీ చేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4వేలుగా ప్రభుత్వం నిర్ధారించగా… ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ.7,500గా నిర్ధారించింది. అలాగే… వెంటిలేటర్ తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ.9 వేలు నిర్ధారించగా… పీపీఈ కిట్ ధర రూ. 273 మించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

హెచ్ ఆర్ సీటీ- రూ.రూ.1995, డిజిటల్ ఎక్స్ రే- రూ.1300, ఐఎల్6- రూ.1300, డీడైమర్-రూ.300, సీఆర్ పీ- రూ.500, ప్రొకాల్ సీతోసిన్-రూ.1400, ఫెరిటీన్- రూ.400, ఎల్ డీహెచ్-రూ 140గా ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సు కు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలు తీసుకోవాలని.. ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సు కు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలు తీసుకోవాలని నిర్ధారించింది తెలంగాణ సర్కార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news