ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేశాం: జగదీశ్ రెడ్డి

-

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతూ తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సర్వే జరుగుతోందని చెప్పి ఏపీ ప్రభుత్వం కప్పిపుచ్చుకుందని వ్యాఖ్యానించారు. అపెక్స్ కమిటీ, కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలిపామన్నారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఆంధ్రా పాలకులకు ముందు నుంచి ఉన్న అలవాటు అని విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయని కుట్రల్లేవన్నారు. రాజశేఖర్ రెడ్డి కుట్రలకు ఆనాటి కాంగ్రెస్ నేతలే మద్దతిచ్చారని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.

ఏపీ అక్రమాలపై తెలంగాణ ప్రజలంతా ఒక్కటిగా పోరాడాలని జగదీశ్ రెడ్డి పిలుపినిచ్చారు. జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు ద్రోహం చేసినవేనన్నారు. ఒక్క చుక్క తెలంగాణ నీటిని కూడా ఆంధ్రాకు పోనివ్వమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ ద్రోహాన్ని అడ్డుకుని తీరుతామని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలపై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చామని జగదీశ్ పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా అక్రమంగా పనులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని కేసు వేసినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news