బాల్క సుమన్ కాదు.. బానిస సుమన్.. ఫేక్ లెటర్‌పై రఘునందన్ రావు ఆగ్రహం

-

హైదరాబాద్: సీఎం కేసీఆర్ క్షమించాలని ఈటల రాజేందర్ గతంలో లేఖ రాసినట్లు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. అది ఫేక్ లేఖ అని ఆయన తెలిపారు. ఆ ఫేక్ లేఖపై ఈటల రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసీఆర్ తండ్రి అయితే కుమారుడు లాంటి వారైన ఈటల పట్ల వ్యవహరించిన తేరేంటని రఘునందన్ రావు మండిపడ్డారు. ఈటల రాజేందర్ కుమారుడి పట్ల కూడా టీఆర్ఎస్ నేతల ప్రవర్తన ఏట్లుందని ఆయన ప్రశ్నించారు. రాత్రి రాత్రికి ఈటలను బర్తరఫ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటల పట్ల కేసీఆర్ ప్రవర్తన సరిగా లేదన్నారు. ఈటల రాజేందర్ భూములు టీఆర్ఎస్ కోసం తాకట్టు పెట్టినప్పుడు అవి కబ్జా భూములు కావా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదన్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చిందని రఘునందన్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏం చేశారో.. విజయశాంతిని అడిగితే చెబుతారని రఘునందన్ తెలిపారు.దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారన్నారు. వచ్చిన తెలంగాణలో ఫలితాలు టీఆర్ఎస్ నేతలకు.. కష్టాలు తమకు అని ప్రజలనుకుంటున్నారని రఘునందన్ రావు విమర్శించారు. బాల్క సుమన్ కాదని.. బానిస సుమన్ అని విమర్శించారు.

 

టీఆర్ఎస్ నేతలు ఒక్కో చోట ఒక్కో మాట మాట్లడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కంటే సీనియర్ అయిన నేతనే నాగార్జున సాగర్ ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్‌కు ఏంచేయాలో తెలియడం లేదన్నారు. టీఆర్ఎస్‌కు హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ టీమ్‌గా మారుతుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news