హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అడ్డగూరు పోలీస్ స్టేషన్ లాకప్ డెత్‌పై సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మరియమ్మ పట్ల వ్యహరించిన తీరును సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది.
కాగా అంతకుముందు గవర్నర్‌ను కూడా కాంగ్రెస్ నేతలు కలిశారు. మరియమ్మ లాకప్ డెత్‌పై తమిళిసైకు వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు ఆపాలని కోరారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో నిందితులను కాపాడేందుకు ప్రభుత్విస్తోందని ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొందరు పోలీస్ శాఖకు మచ్చతెచ్చేలా పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి గుణపాఠం చెబుతామని అన్నారు