న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 48 వేల 786 కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి తాజాగా మొత్తం 1,005 మంది మృతి చెందారు. వైరస్ నుంచి మరో 61 వేల 588 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 3 కోట్ల 4 లక్షల 11 వేల 634కు చేరింది. ఇప్పటివరకూ మొత్తం 2 కోట్ల 94 లక్షల 88 వేల 918 మంది బాధితులు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు మొత్తం 3 లక్ష 99 వేల 459 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 33 కోట్ల 57 లక్షల 16 వేల 019 మందికి డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది.