ప్ర‌దీప్‌కు ప్ర‌పోజ్ చేసిన శ్రీముఖి.. విష‌యం ఏంటంటే..?

-

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్లుగా దూసుకుపోతున్నారు శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు. వీరిద్ద‌రు చేసిన ప్ర‌తి షో మంచి రేటింగ్‌తోనే ఉంది. వీరిద్ద‌రి ఎన‌ర్జీ అంత ఇంతా కాదు. వీరిద్ద‌రూ ఓ వైపు రియాలిటీ షోల‌తో పాటుగా ఇంకోవైపు మూవీల్లో కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి ఇంత‌కుముందు కొన్ని ప్రోగ్రామ్‌లు కూడా చేశారు.

శ్రీముఖి,
శ్రీముఖి,

అయితే శ్రీముఖి, ప్రదీప్ మధ్య చాల కాలం నుంచి సాన్నిహిత్యం ఉంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌న్నిహిత్యం కొన్నిసార్లు హ‌ద్దులు దాట‌డంతో వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు నెట్టింట వస్తూనే ఉంటాయి. అంత క్లోజ్‌గా ఉంటారు మ‌రి వీరిద్ద‌రూ.

కానీ రీసెంట్గా మరోసారి వీరిద్ద‌రూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అన్న‌ట్టు మారిపోయారు. అందుకు కార‌ణం ఓ ప్రోగ్రామ్‌లో అంద‌రూ చూస్తుండగానే యాంక‌ర్ ప్రదీప్‌కు శ్రీముఖి ఐ లవ్ యూ అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. జీ తెలుగు ఛాన‌ల్‌లో వచ్చే డ్రామా జూనియర్స్‌కు యాంక‌ర్‌గా ప్రదీప్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి వ‌చ్చిన శ్రీముఖి ముసుగు తీసేసి యాంక‌ర్‌ ప్రదీప్‌కు ప్రపోజ్ చేస్తూ క‌నిపిస్తోంది. ఆ వెంట‌నే ప్ర‌దీప్ ప‌క్క‌న నిల్చుని సిగ్గు ప‌డుతుంది. దీంతో మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే కామెంట్లు మొద‌ల‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news