గుడ్ న్యూస్: భారత రక్షణ మంత్రిత్వ శాఖలో 458 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల చెయ్యగా… మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ట్రేడ్స్ మెన్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్ మెన్ తదితర విభాగాల్లో ఖాళీలని భర్తీ చేస్తోంది. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే..

ట్రేడ్స్ మెన్ మేట్ (Tradesmen Mate) విభాగంలో 330 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు. రూ. 18 వేల నుంచి రూ. 56,900 వరకు వేతనం ఇస్తారు. అలానే జేఓఏ (JOA) విభాగంలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

నెలకు రూ. 19,900 నుంచి 56,900 వరకు వేతనం ఇవ్వనున్నారు. ఎంటీఎస్(MTS) విభాగంలో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు అర్హులు. అదే విధంగా ఫైర్ మెన్ విభాగంలో 64 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56,900 వరకు శాలరీ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే మెటీరియల్ అసిస్టెంట్ (Material Assistant) విభాగంలో 19 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు రూ.29,200 నుంచి రూ. 56,900 వరకు వేతనం ఇవ్వనున్నరు.

ఏబీఓయూ ట్రేడ్స్ మెన్ మేట్ (ABOU Tradesman Mate) విభాగంలో మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ.56,900 వరకు వేతనం ఇస్తారు.

పూర్తి వివరాలకు https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ లో చూడచ్చు.
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా: కమాండర్, 41 ఫీల్డ్ ఆమ్యునేషన్ డిపో, 909741 సీవో 56 ఏపీఓ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news