అమరావతి: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. పండలన్నీ తొలి ఏకాదశి నుంచే మొదలవుతాయని చంద్రబాబు తెలిపారు. రుతుపవనాల ఆగమనం వేళ వర్షాలు కురిసి పంటలు బాగా పడాలని ఆయన కోరుకున్నారు. లోకేశ్ మాట్లాడుతూ తొలి ఏకాదశితో వ్యవసాయ పనులు కూడా ఊపందుకున్నాయన్నారు. రైతులకు ప్రభుత్వం కొనుగోలు బకాయిలు ఇస్తే సాగుకు సాయంగా ఉంటుందని చెప్పారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో తొలిఏకాదశి ఘనంగా జరుగుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే నదీ స్నాలు చేస్తున్నారు. వైష్టవ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తొలిఏకాదశి రోజు పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని భావిస్తారు. దీంతో పొద్దునే లేని నదీ స్నానాలు చేసి ఉపవాస దీక్షలు చేపడతారు.