న్యూఢిల్లీ: రెండో రోజు పార్లమెంట్ సభలు ప్రారంభంకాగానే పెగాసస్‌పై ఉభయసభలు దద్దరిల్లాయి. దేశంలో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని రాజ్యసభ్, లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో రెండు సభలు కూడా ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నారు. పెగాసస్ వ్యవహారంపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
అంతేకాదు స్పీకర్ వెల్‌లోకి ప్రయత్నించాయి. ఫార్మెంట్‌లో పెట్టిన వరుస తీర్మానాలపైనే చర్చ ఉంటుందని చెప్పడంతో ప్రతిపక్షాలు మరింతగా నినాదాలు చేశఆయి. ప్రతిపక్షాల అరుపులు, కేకలతో రాజ్యసభ్, లోక్ సభ దద్దరిల్లిపోయాయి. అటు పెగసస్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం నడిచింది. సభలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ప్రతిపక్షాలు ఆగలేదు. దీంతో స్పీకర్ లోక్ సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభ ఛైర్మన్ కూడా సభను వాయిదా వేశారు.
మరోవైపు పెగాసస్ వ్యవహారంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆందోళనను పిలుపు నిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగనున్నాయి.