ఆన్‌లైన్ గేమ్‌కోసం ఏకంగా త‌ల్లిని మోసం చేసిన పిల్ల‌లు..!

-

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఏ స్థాయిలో ఉందో ప్ర్య‌తేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితులు కార‌ణంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు స్టూడెంట్ల‌కు ఆన్ లైన్ క్లాసులే జ‌రుగుతున్నాయి. దీంతో అంద‌రూ త‌మ పిల్ల‌ల‌కు ఫోన్లు కొనిస్తున్నారు. ఇక ఇదే క్ర‌మంలో ఓ త‌ల్లి కూడా త‌న పిల్ల‌ల‌కు ఫోన్ కొనిస్తే చివ‌ర‌కు అది త‌న కొంప ముంచే వ‌ర‌కు వ‌చ్చింది. కార‌ణం వారి పిల్ల‌లు ప‌బ్జి గేమ్‌కు అడిక్ట్ కావ‌డ‌మే.ఇప్పుడున్నఆన్‌లైన్ (online) గేముల‌తో ఎంత పెద్ద ప్ర‌మాదం ఏర్ప‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కాగా వీరి మెంటాలిటీని ఆస‌రాగా చేసుకుని సైబ‌ర్ నేర‌గాళ్లు కూడా నిలువునా ముంచేస్తున్నారు. ప్ర‌స్త‌తుం ఈ ఇద్ద‌రు పిల్లలు ఇలాంటి గేమ్ మాయ‌లోనే ప‌డి త‌మ కుటుంబం మొత్తాన్ని చివ‌ర‌కు లాస్ చేశార‌నే చెప్పాలి.

కోజికోడ్‌కు చెందిన ఒక మహిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌కు కూడా ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్లు కొనిచ్చింది. ఆమె భ‌ర్త విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. ఇక ఆమె ఇద్ద‌రు పిల్లలు కూడా తొమ్మిదో త‌ర‌గ‌తి, అలాగే పదో తరగతిల్లో చ‌దువుతుండ‌గా వారిద్ద‌రూ కూడా బ్యాన్ చేసిన పబ్‌జి గేమ్ బాగా అడిక్ట్ అయ్యి దీనిలో నెక్ట్స్ లెవల్స్ కు వెళ్లేందుకు ఏకంగా త‌న త‌ల్లి అకౌంట్ నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా కొట్టేసి షాక్ ఇచ్చారు. దీంతోచివ‌ర‌కు త‌న పిల్ల‌లు ఇలా చేశారని తెలుసుకుని దిమ్మ‌తిరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news