మహర్షి సాహసం చేస్తున్నాడా..!

-

సూపర్ స్టార్ మహేష్ తన కెరియర్ లో 25వ సినిమాగా చేస్తున్న సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఇప్పటివరకు ఏప్రిల్ 5,6 తారీఖుల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు.

అయితే ఆ టైంకు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే అవకాశం లేదని సినిమాను లాస్ట్ వీక్ కు వాయిదా వేశారు. ఇక ఏప్రిల్ 26 శుక్రవారం రిలీజ్ చేయాలని చూస్తుండగా మరో రెండు రోజులు ముందు అంటే ఏప్రిల్ 24 బుధవారం మహర్షిని తీసుకు రావాలని చూస్తున్నారు. శుక్రవారం రిలీ అయితే సినిమా ఎలా ఉన్నా వీకెండ్ వరకు బుకింగ్ ఉండే అవకాశం ఉంటుంది. బుధవారం రిలీజ్ అంటే సినిమా టాక్ బాగా లేకుంటే వీకెండ్ వరకే డీలా పడుతుంది. మరి మహర్షి చేస్తున్న ఈ సాహసం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news