నీళ్ళ విషయంలో ఆంధ్రా వాళ్ళు దాదాగిరి చేస్తున్నారు : కెసిఆర్

-

ఇవాళ జరిగిన హాలియా సభలో ఏపీ సర్కార్ పై సిఎం కెసిఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభించే తెలంగాణ వ్య‌తిరేక వైఖ‌రి కావొచ్చు.. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మ‌న‌కు ఇబ్బంది జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌నం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సిఎం కెసిఆర్.

kcr-jagan
kcr-jagan

జానారెడ్డి మాట‌తప్పి నాగార్జున సాగ‌ర్‌లో పోటీచేశారని.. దేశానికే ఆద‌ర్శంగా 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చామన్నారు. ద‌ళిత‌ బంధుపై ఎన్నో విమ‌ర్శ‌లు చేస్తున్నారని.. 12 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ద‌ళిత బంధు అమలు చేస్తామన్నారు కెసిఆర్. ఒక్కో కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఆర్ధిక‌సాయం త‌ప్ప‌కుండా చేస్తామని ప్రకటించారు కేసీఆర్‌. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. ప్రతీ నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళిత బంధు ఇస్తామన్నారు. దళితబంధుతో పార్టీలకు గుండెదడ మొదలైందని.. ఆరునూరైనా సరే దళితబంధు అమలు చేస్తామని చెప్పారు.
సమైక్య పాలకుల సంచులు మోసి ఉద్యమంలో కలసిరాలేదని.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news