ముంబై: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు. తాజాగా కుంద్రాకు చెందిన ఆర్మ్స్ ప్రైమ్ సంస్థపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సంస్థ డైరెక్టర్ సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అయితే 2019లోనే హాట్ షాట్స్ యాప్‌ను అమ్మేసి కొత్త సంస్థను ప్రారంభించినట్టు పోలీసుల విచారణలో రాజ్‌కుంద్రా తెలిపారు. దీంతో ఆర్మ్స్ ప్రైమ్ సంస్థ డైరెక్టర్‌ను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు.
ఇక రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో నెటిజన్లు శిల్పాశెట్టి కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారు. భర్త అరెస్టవడంతో..ఆ ప్రభావం శిల్పాశెట్టి కెరీర్‌పై కూడా పడింది. ఇప్పటికే కోట్లలో నష్టపోయారు. రాజ్‌కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. పలు షోల షూటింగ్స్‌ని కూడా రద్దు చేసుకున్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కి శిల్పా రూ. 18 నుంచి 22 లక్షల వరకు పారితోషికంగా తీసుకుందని టాక్ . అయితే రాజ్ కుంద్రా ఎపిసోడ్ తర్వాత ఈ షో షూటింగ్‌కి కూడా శిల్పాశెట్టి వెళ్లడం లేదు. దీంతో శిల్పాశెట్టి దాదాపు రూ. 2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజ్‌కుంద్రా కేసు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా లేదు. దీంతో డ్యాన్స్ షోలో శిల్పాశెట్టిని ఉంచాలా? వద్దా? అనే విషయంపై నిర్వాహకులు పరిశీస్తున్నారు. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది..మొత్తానికి రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసుతో శిల్పాశెట్టికి కష్టాలు, నష్టాలు తప్పడం లేదని విశ్లేషకులు అంటున్నారు