వచ్చే 1 నుంచే పాఠశాలలు రీ ఓపెన్ : కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణ‌లో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలలో ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 8 వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవ్వాళ సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టేటస్ రిపోర్ట్ నీ సీఎం కి పంపిన విద్యాశాఖ… తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని… విద్యార్థులకు ప్రమాదం లేదని రిపోర్ట్ అందజేసింది.

పలు రాష్ట్రాల్లో తరగతుల ప్రారంభం పై సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లిన విద్యాశాఖ… తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు విద్యాశాఖ. స్కూళ్లు తెరవమని ఇప్పటికే సూచించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ.. రేపు లేదా సోమవారం విద్యాశాఖ ఉన్నతాధి కారుల సమావేశం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ లెక్కన… 8వ త‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు ఇవాళ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే… సెప్టెంబ‌ర్ 1 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష క్లాసులు నిర్వహించాలని ప్రకటించే ఛాన్స్‌ కనిపిస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news