కొంపముంచిన రఘురామ…జగన్‌ని ఇలా బుక్ చేసేశారా?

-

వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి..అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు మరొకసారి జగన్ ప్రభుత్వాన్ని బుక్ చేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కూర్చుని తనదైన శైలిలో రాజకీయం చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రఘురామ, టీడీపీకి బెనిఫిట్ అయ్యేలా వైసీపీని బుక్ చేశారు. ఇప్పటికే రఘురామ, చంద్రబాబులు కలిసి తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీలు..రఘురామపై అనర్హత వేటు వేయించడానికి నానా కష్టాలు పడుతున్నారు.

రఘురామకృష్ణం రాజు / జగన్
రఘురామకృష్ణం రాజు / జగన్

ఢిల్లీ పెద్దల సపోర్ట్ ఉండటంతో రఘురామపై వేటు పడటం లేదు. పైగా ఆయన ఢిల్లీలో ఉంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఆడేసుకుంటున్నారు. తాజాగా ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్రం, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులని జగన్ ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ కోర్టుకు కూడా వెళ్లింది. హైకోర్టు సైతం ఉపాధి బిల్లులని వెంటనే చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయినా సరే ప్రభుత్వం మాత్రం బిల్లులని చెల్లించలేదు. అంటే గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు కాంట్రాక్టులు తీసుకుని ఉపాధి పనులు చేయించారని జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఈ అంశంపై టీడీపీ గట్టిగానే పోరాడుతున్నారు. ఇక టీడీపీ పోరాటానికి రఘురామ మద్ధతుగా వచ్చి, ఉపాధి హామీ పనులకు మీరిస్తున్న నిధుల్ని జగన్ ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు రఘురామ లేఖ రాశారు. ఆ నిధులు వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రమంత్రిని కోరారు.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. రఘురామ లేఖపై సమగ్ర వివరణ పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో జగన్ ప్రభుత్వం ఇరుకున పడ్డట్లు అయింది. రాష్ట్రం సరైన వివరణ ఇవ్వకపోతే ఉపాధి నిధుల విషయంలో కేంద్రం సీరియస్ అయ్యేలా కనిపిస్తోంది. అసలే అప్పులుతో ఇబ్బందులు పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని, రఘురామ గట్టిగా దెబ్బకొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news