రేవంత్ ముందు రెండు టార్గెట్లు…సక్సెస్ అవ్వకపోతే?

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యం ఇప్పుడు ఒక్కటే…అది కేసీఆర్‌ని గద్దె దించడం. ఎంతోకాలంగా కేసీఆర్‌పై పోరాటం చేస్తున్న రేవంత్‌కు రాజకీయంగా ఎప్పుడు పెద్దగా కలిసిరాలేదనే చెప్పొచ్చు. టీడీపీలో ఉండగా కేసీఆర్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కానీ ఊహించని పరిణామాలతో రేవంత్‌కు ఎదురుదెబ్బలే తగిలాయి. అందుకే కాంగ్రెస్‌లోకి వచ్చి రేవంత్ పోరాటం మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్‌లో ఉండే అంతర్గత రాజకీయాల వల్ల కూడా రేవంత్‌కు, ఎప్పుడు కేసీఆర్‌కు చెక్ పెట్టే అవకాశాలు పెద్దగా రాలేదు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మాత్రం రేవంత్‌కు, కేసీఆర్‌కు చెక్ పెట్టే మంచి అవకాశం దొరికిందని చెప్పొచ్చు. అందుకే పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి రేవంత్ దూకుడుగా ముందుకెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ కేసీఆర్‌ని గద్దె దింపేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ టార్గెట్ కేసీఆర్ ఒక్కరే కాదు. ఆ టార్గెట్ కంటే ముందు…రేవంత్ రెండు గండాలని దాటాలి. రెండు టాస్క్‌ల్లో రేవంత్ సక్సెస్ కావాలి. అవి ఏంటంటే…మొదట టీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నాయం అని నిరూపిస్తూనే, బీజేపీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీజేపీ కూడా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెక్ పెట్టి, తమకే టీఆర్ఎస్‌కు ఢీకొట్టే శక్తి ఉందని నిరూపించుకోవాలి.

ఇక రెండు టాస్క్ వచ్చి….ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులని ఆకర్షిస్తూనే, తమ పార్టీ నుంచి నాయకులని బయటకు వెళ్లనివ్వకుండా చూసుకోవాలి. అలా చేయగలిగితే రేవంత్, కాంగ్రెస్‌ని చాలావరకు బలోపేతం చేసుకోగలరు. ఈ రెండు టాస్క్‌ల్లో సక్సెస్ అయితే, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ధీటుగా రేవంత్ నిలబడగలరు. లేదంటే అంతే సంగతులు.

Read more RELATED
Recommended to you

Latest news