ఫుడ్ కోసం లైన్ లో నిలుచున్న బిల్ గేట్స్.. వైరల్ పిక్

-

Bill gates stood in queue in restaurant

బిల్ గేట్స్… పరిచయం అవసరం లేని వ్యక్తి. మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి తెలుసు కదా. అపర కుబేరుడు… ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఆయన ఒకరు. ఆయన చిటికేస్తే.. ఏదంటే అది ముందుకొచ్చి వాలుతుంది. కానీ.. ఆయన చాలా సాధారణంగా ఉంటారు. అదే ఆయన్ను వినూత్నంగా ఉండేలా చేస్తుంది. తాజాగా ఆయన చేసిన మరో పని కూడా ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.

ఇటీవల షియాటిల్ లో ఉన్న ఓ రెస్టారెంట్ కు వెళ్లిన బిల్ గేట్స్.. బర్గర్, ఫ్రైస్, కోక్ బాటిల్ కొనుక్కోవడం కోసం లైన్ లో నిలబడ్డాడు. రెస్టారెంట్ ముందు క్యూ ఉండటంతో… లైన్ లో నిలబడి ఆయనకు కావాల్సిన ఫుడ్ ను తీసుకొని వెళ్లారు. బిల్ గేట్స్ అక్కడికి వచ్చి క్యూలో నిలబడటం చూసిన రెస్టారెంట్ సిబ్బంది, కస్టమర్లు నోరెళ్లబెట్టారు. కోట్ల ఆస్తి ఉన్నా.. ఎంత సాధారణ వ్యక్తిలా వచ్చి క్యూలో నిలబడ్డాడు.. అంటూ ప్రశంసించారు. ఆ ఫోటో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా బిల్ గేట్స్ ను తెగ మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news