ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 156 కరోనా కేసులు !

-

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 156 చేరాయి కరోనా కేసులు. నిన్న ఒకే రోజు అత్యధికంగా 20 కేసులు నమోదు అయ్యాయి. వారిలో నలుగురు ఉపాద్యాయులు, 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మద్దిపాడు మండలం నేలటూరు యంపీయూపీ స్కూల్ లో నలుగురికి పాజిటివ్ రాగా.. ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్ లో నలుగురికి కరోనా సోకింది.

Schools starts from today in ap
Schools starts from today in ap

అలాగే కొండపి మండలం పెట్లూరు జెడ్పీ హైస్కూల్ లో ముగ్గురికి సోకగా.. పొన్నలూరు మండలం పి.అగ్రహారం ఎంపీ స్కూల్ లో నలుగురికి, విప్పగుంట ఎంపీపీఎస్ లో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కనిగిరి మొదటి వార్డు ఎంపీ స్కూల్ లో ఇద్దరికి, నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం ఎంపీ స్కూల్, హెచ్.నిడమానూరు ఎయిడెడ్ స్కూల్ లో ఒకరికి చొప్పున కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాద్యాయులు, విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news