ఎత్తు త‌క్కువ‌గా ఉండే వారికే కోపం బాగా వ‌స్తుంద‌ట‌..!

-

మ‌నుషుల‌కు క‌లిగే అనేక ర‌కాల‌ భావాల్లో కోపం కూడా ఒక‌టి. మ‌న‌లో అనేక మంది చాలా సంద‌ర్భాల్లో కోపానికి గుర‌వుతుంటారు. కొన్ని సార్లు ప‌ట్ట‌లేనంత కోపం వ‌స్తుంది. కొన్ని సార్లు కోపం త‌క్కువ‌గా వ‌స్తుంది. అయితే కోపం విష‌యానికి వ‌స్తే.. ఎత్తు త‌క్కువ‌గా ఉండే వారికే కోపం ఎక్కువ‌గా వ‌స్తుంద‌ట‌. బాగా పొడ‌వుగా ఉండే వారికి కోపం త‌క్కువ‌గా వ‌స్తుంద‌ట‌. అవును, ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లే చెబుతున్నాయి. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే…

అట్లాంటాలోని సెంట‌ర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ వారు ఈ మ‌ధ్యే 18 నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న 600 మంది పురుషుల‌ను ప్ర‌శ్నించారు. డ్ర‌గ్స్ తీసుకోవ‌డం, నేరాల‌కు పాల్ప‌డ‌డం, కోపం రావ‌డం త‌దిత‌ర అంశాల గురించి సైంటిస్టులు వారిని ప్ర‌శ్నించి స‌మాధానాలు రాబ‌ట్టారు. చివ‌ర‌కు సైంటిస్టులు ఏం తేల్చారంటే… ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారికే కోపం ఎక్కువ‌గా వ‌స్తుంద‌ట‌. పొడ‌వుగా ఉన్న‌వారికి కోపం త‌క్కువ‌గా వ‌స్తుంద‌ని తేల్చారు.

అయితే ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారికి కోపం బాగా రావ‌డానికి వెనుక ఉన్న కార‌ణాలను కూడా సైంటిస్టులు వివ‌రిస్తున్నారు. సాధార‌ణంగా పొట్టిగా ఉన్న‌వారు చిన్న‌త‌నంలో ఎత్తు త‌క్కువ‌గా ఉన్నందుకు ఇత‌రుల చేతుల్లో హేళ‌నకు గుర‌య్యే సంద‌ర్భాలు ఎక్కువ‌ట‌. పొట్టిగా ఉన్నార‌ని చెప్పి అలాంటి వారిని ఇత‌రులు బాగా ఏడిపిస్తార‌ట‌. అందుక‌నే వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారికి ఓ ర‌క‌మైన కాంపెక్ల్స్ డెవ‌ల‌ప్ అవుతుంద‌ట‌. దాన్నే నెపోలియ‌న్ కాంప్లెక్స్ అంటార‌ట‌. ఈ స్థితిలో ఉన్న‌వారికి స‌హ‌జంగానే కోపం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇక వారిని ఉద్రేకానికి గురి చేసే సంఘ‌ట‌న‌లైతే ఇంకా మ‌రింత కోపోద్రిక్తులు అవుతార‌ట‌. అదీ.. ఎత్తు తక్కువ‌గా ఉన్న‌వారికి కోపం బాగా వ‌చ్చేందుకు గ‌ల అస‌లైన కార‌ణం. అయితే ఎత్తు త‌క్కువ‌గా ఉన్నంత మాత్రాన అంద‌రికీ కోపం బాగా వ‌స్తుంద‌ని కాదు. కొంద‌రు పొడ‌వుగా ఉండేవారు కూడా తీవ్రమైన ఆగ్ర‌హావేశాల‌కు లోన‌వుతుంటారు. అది వేరే విషయం. ఎంతైనా ఇది సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న క‌దా.. ఫ‌లితాలు అలాగే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి.. అంతే..!

Read more RELATED
Recommended to you

Latest news