కరోనాపై తప్పుడు సమచారంలో టాప్ లో నిలిచిన ఇండియా..

-

సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుకార్ల గోల ఎక్కువైపోయింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా వైరల్ అవుతున్న సంఘటనలు కోకొల్లలు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిపై ఇలాంటి తప్పుడు సమాచారం వేల సంఖ్యల్లో వచ్చింది. ఈ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వాళ్ళలో ఇండియా టాప్ లో నిలిచింది. ఈ మేరకు కెనడాకి చెందిన ఆల్బెర్టా విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయాయి.

2020జనవరి 1వ తేదీ నుండి 2021మార్చ్ 1వ తేదీ వరకు జరిగిన అధ్యయనంలో నమ్మలేణి నిజాలు బయటకు వచ్చాయి. కరోనా మహమ్మారిపై దాదాపు పదివేలకు పైగా తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వచ్చాయి. ఈ తప్పుడు ప్రచారానికి ముఖ్య సాధనంగా సోషల్ మీడియా నిలిచింది. దాదాపు 85శాతం తప్పుడు సమాచారం సోషల్ మీడియా ద్వరానే బయటకు వెళ్తుందని ఆల్బెర్టా యూనివర్సిటీ తెలిపింది. ఈ తప్పుడు వార్తల ప్రచారంలో ఇండియా మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో బ్రెజిల్, మూడవ స్థానంలో అమెరికా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news