గణేష్ నిమజ్జనంపై మంత్రి తలసాని కీలక ఆదేశాలు

-

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పై అధికారులతో ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష నిర్వహించారు. అయితే… ఈ సమీక్ష లో మేయర్ విజయలక్ష్మి, సీపీ అంజనికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ… దేశం లో నే హైదరాబాద్ లో జరిగే వేడుకలు ప్రత్యేకమని తెలిపారు.

అన్ని శాఖలు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాయని… ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించా రు. దాదాపు 40 కి పై గా క్రేన్స్ ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసామని… 19 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు లో పాల్గొంటారన్నారు. హైదరాబాద్ పరిధిలో 12 వేల మంది సిబ్బంది నిమజ్జన విధుల్లో పాల్గొంటారని… 25 బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేసాం, వాటిలో కూడా నిమజ్జనం జరుగుతుందని వివరించారు. ఉత్సవ కమిటీలు, ప్రజలు.. అధికారులకు సహకరించాలని.. ఘనంగా నిమజ్జనం జరుపుకుంటామని తెలిపారు. ప్రజలందరూ కరోనా నియమాలు పాటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news