మన దేశంలో 18ఏండ్లు నిండక ముందు పెండ్లి చేసుకుంటే అది చెల్లదు. పైగానేరం కూడా. అయితే ఇలాంటి సున్నితమైన కేసుల్లో ఇప్పటికీ ఎన్నోసార్లు కోర్టులు తమ వైఖరిని స్పష్టంగా తెలిపాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ కేసు హైలెట్ అయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 సంవత్సరాల వయస్సు రాకముందే మైనర్ వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. కాగా ఆ తరువాత అధికారికంగా వయోజనుడిగా మారిన తరువాత వారి వివాహం చెల్లదని ప్రకటించి నట్లయితే విడాకుల ద్వారా మాత్రమే భర్త నుండి విడిపోవడానికి మన నిబంధనలు వెల్లడిస్తున్నాయి.
కాగా ఈ తీర్పును ఇప్పుడు పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చింది. లూథియానాలోని ఒక కుటుంబ న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి మరీ ఆ విధంగా ఈ జంటకు పరస్పర అంగీకారంతో విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955 లోని సెక్షన్ 13-బి కింద విడాకుల కోసం పిటిషన్ ను అనుమతించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ జంట గతేడాది జూన్ 22న లూధియానా కుటుంబ న్యాయస్థానం ముందు తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరారు. హిందూ వివాహ చట్టం, 1955 యొక్క సెక్షన్ 5(3)ను కుటుంబ కోర్టు ఉదహరించింది, అయితే హిందూ చట్టం ప్రకారం వధువు చట్టబద్ధంగా వివాహానికి అర్హురాలిగా ప్రకటించేందుకు వధువు 18 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
జస్టిస్ రీతు బహ్రీ మరియు జస్టిస్ అరుణ్ మోంగా ఈ ఉత్తర్వును జారీ చేశారు, “భార్య వివాహ సమయంలో 17 సంవత్సరాలు, 6 నెలలు మరియు 8 రోజులుగా ఉందని, ఆమె వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించడానికి ఎటువంటి పిటిషన్ దాఖలు కానందున హిందూ వివాహ చట్టం సెక్షన్ 13-బి కింద విడాకుల కోసం పిటిషన్, 1955, అనుమతించాలంటూ కోర్టు వెల్లడించింది.