ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధాల్లేవ్.. మూఢనమ్మకాన్ని కాల్చేసిన అస్సాం సర్కార్.

-

ప్రపంచ వ్యాప్తంగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు చైనాలో భారీ డిమాండ్ ఉంది. కొమ్ముల్లో ఔషధగుణాలు ఉన్నాయని, దానివల్ల అనేక వ్యాధులు నయం అవుతాయని ప్రచారం కావడమే ఆ డిమాండ్ కి కారణం. అలాగే వియత్నాంలో ఖడ్గమృగానికి కొమ్ము కలిగి ఉండడం హోదాగా భావిస్తారు. ఈ రెండు నమ్మకాల వలన ఖడ్గమృగాల వేట ఎక్కువయ్యింది. దాంతో అప్రమత్తమైన అస్సాం సర్కార్ ఈ మూఢనమ్మకాన్ని బద్దలు కొట్టాలని నిర్ణయించుకుంది.

స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఖడ్గమృగ కొమ్ములన్నింటినీ ఒక దగ్గర పేర్చి కాల్చివేసింది. కొమ్ముల్లో ఎలాంటొ ఔషధ గుణాలు లేవని, అది కేవలం మూఢ నమ్మకం మాత్రమేనని, ఆ నమ్మకం వల్ల మూగజీవాలైన ఖడ్గమృగాలను చంపడం సరికాదని, ఇప్పటికైనా ఖడ్గమృగాల వేట ఆపేయాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని అస్సాం సర్కారు కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news