కరోనా వ్యాక్సిన్: డోసుల మధ్య గడువు తగ్గించిన ప్రభుత్వం.. కేవలం వారికి మాత్రమే.

-

కరోనాపై పోరాడేందుకు భారతదేశం నుండి రెమ్డు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ ఒకటైతే, భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ మరొకటి. వీటితో పాటు దిగుమతి చేసుకున్న స్ఫుత్నిక్ వి కూడా వరుసలో ఉంది. ప్రస్తుతానికి రెండు వ్యాక్సిన్లు మాత్రమే ప్రజలకు ఇస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్ల రెండు డోసుల మధ్య గడువు చాలా 84రోజులుగా ఉందన్నది తెలిసిందే. ప్రస్తుతం ఈ గడువును తగ్గించే పనిలో ఉన్నట్లు సమాచారం.

వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 84రోజుల గడువును నెల రోజులు గడువుకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే అది ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తీసుకునే వారికి మాత్రమే అని సమాచారం. కోవిడ్ టీకాను ప్రైవేటు ఆస్పత్రుల్లో తీసుకునే వారికి వ్యాక్సిన్ల మధ్య గడువు నెలరోజులు మాత్రమే ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news