ఎల్లుండి మరోసారి ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీ టూర్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేసుకున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ నెల 25వ తేదీ అంటే ఎల్లుండి… ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లిన అనంతరం 26వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా నేతృత్వంలో… జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

ఈ కీలక సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రo, ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీకి పయనం కానున్నారు. ఇక నిన్న రాత్రి తెలంగాణ సీఎస్ మరియు డీజీపీలతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్…. తెలంగాణ రాష్ట్రం తరఫున ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news