Ram Gopal Varma: వరంగల్‌లో ఆర్జీవీ సీక్రెట్ టూర్‌.. కార‌ణ‌మేదేనా!

-

Ram Gopal Varma: ఆర్జీవీ.. వివాదాల‌కు కేరాఫ్ అడ్రాస్‌. ఆయ‌న‌ ఏం చేసిన సంచలనమే. నిజానికి ఆర్జీవీ ఎక్క‌డుంటే వివాదాలు అక్క‌డుంటాయినే చెప్ప‌వ‌చ్చు. ఆయన సినిమాలు కంటే.. ఆయ‌న చేసే రచ్చ ఎక్కువ. అవే జనల నోళ్ళల్లో నానుతుంటాయి. ఇప్పటికే అనేక వివాద‌స్ప‌ద బయోపిక్‌లతో హాట్ టైపిక్ గా మారినా ఆయ‌న మ‌రో సంచలనం తెరలేపనున్నాడని తెలుస్తుంది.

తాజాగా కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ తీయ‌నున్నట్టు తెలుస్తుంది. అందుకోసం వ‌ర్మ వరంగల్‌లో సీక్రెట్ పర్యటిస్తున్నారు. ఈ చిత్రం కోసం వర్మ.. కొండా దంప‌తుల విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇందుకోసం వ‌రంగ‌ల్ లోని ఎబీ కళాశాల సిబ్బంది, అధ్యాపకులను రహస్యంగా క‌లిసి, కొంతసేపు రహస్యంగా రాంగోపాల్ వర్మ మాట్లాడినట్టు సమాచారం. మరి కొండ దంప‌తుల‌ బయోపిక్ ఎలాంటి వివాదానికి తెరతీస్తుందో చూడలి. ఇక ప్రస్తుతం వర్మ పలు వెబ్ సిరీస్ లతో సిద్ధంగా ఉన్నాడు. లేడీ బ్రుస్ లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు వర్మ.

తెలంగాణ రాజ‌కీయాల్లో కొండా దంప‌తులకు ఓ విశిష్ట స్థానం ఉంది. కొండా సురేఖ వ‌రంగ‌ల్ వాసీ,
ఆమె విద్యాభ్యాసం మొత్తం వ‌రంగ‌ల్ లోనే జ‌రిగింది. ఆమె బీ.కాం గ్రాడ్యూవేష‌న్ .. 1985 లో కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోని ఎల్‌బీ కాలేజీ లో పూర్తి చేశారు. మండ‌ల ప‌రిష‌త్ స‌భ్యురాలిగా ఆమె త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించ ఆమె రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత శాస‌న‌స‌భ‌లో ఆమె వ‌రంగ‌ల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. అనంత‌రం 2018 లో ఆమె త‌న భ‌ర్తతో స‌హా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news