హెచ్ఆర్సీ ని ఆశ్రయించిన గురుకుల పీఈటీ అభ్యర్థులు

-

తెలంగాణ రాష్ట్ర గురుకుల పీఈటీ అభ్యర్థులు హెచ్ ఆర్సీని ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు పీఈటీ అభ్యర్థులు.. 2017 సెప్టెంబర్ లో పరీక్షలు రాసిన పీఈటీ అభ్యర్థులు… నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఫలితాలు విడుదల చేయకపోవడం పై అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఫలితాలను విడుదల చేసేలా ఆదేశించాలని కోరారు అభ్యర్థులు. TSPSC వెంటనే పీఈటీ నియామకాలు చేపట్టాలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

హైకోర్టు ఆదేశాలు ప్రకారం వెంటనే ఫలితాలను ప్రకటించాలని… చాలా మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. 616 పోస్టులకు 1232 మంది అభ్యర్థులు గతంలో సెలక్ట్ అయ్యామని… 1:1 పద్దతిలో ఫలితాలు ప్రకటించాలని కోరారు అభ్యర్థులు.

2018 మే లో అభ్యర్థుల వేరిఫికేషన్ జరిగిందని.. 2021లో హైకోర్టు స్టే ఎత్తివేసినా..ఇప్పటి వరకు నియామకాలు చెప్పట్టలేదన్నారు అభ్యర్థులు. నాలుగు సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు చేసామని… 10 సార్లు ప్రగతి భవన్ ముట్టడించామని హెచ్ ఆర్సీకి తెలిపారు. 20 సార్లు పబ్లిక్ కమిషన్ ముట్టడి చేశామని…. 3 సార్లు మానవ హక్కుల కమిషన్ ను కలిసామన్నారు. అయిన న్యాయం జరగలేదని…. ఇప్పటికైన వారం రోజుల్లో తమకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news