మంత్రివర్గంలో ట్విస్ట్‌లు…ఎవరిది నిజం అవుతుంది?

-

ఏపీ మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. మంత్రివర్గంలో సగం మందిని పక్కకు తప్పించవచ్చని, కాదు కాదు 80 శాతం మందిని సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇటీవల మొత్తం మంత్రులని సైడ్ చేసి జగన్ కొత్తవారికి అవకాశం కల్పిస్తారని కథనాలు కూడా వచ్చాయి.

Jagan
Jagan

అయితే అధికారికంగా మంత్రివర్గం గురించి ఎలాంటి ప్రకటనలు రాలేదు. కాకపోతే మొదట్లోనే సి‌ఎం జగన్ ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని…రెండున్నర ఏళ్ల తర్వాత 80 శాతం మందిని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రివర్గం గురించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 100 శాతం మంత్రివర్గాన్ని మార్చానున్నారని చెప్పారు. మంత్రివర్గంలో అందరినీ మార్చేసి కొత్తవారిని తీసుకుంటారని అన్నారు.

సి‌ఎం జగన్ తనతో చెప్పారని, సి‌ఎం మాటకు అందరూ కట్టుబడి ఉండాలని బాలినేని చెప్పారు. బాలినేని మాటల ప్రకారం చూసుకుంటే మంత్రులందరూ సైడ్ అయిపోతారని తెలుస్తోంది. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఉంది…తాజాగా మంత్రి పేర్ని నాని సైతం మంత్రివర్గం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట్లోనే 80 శాతం మందిని పక్కనబెడతానని జగన్ చెప్పారని, 20 శాతం పాతవారిని కొనసాగించనున్నారని అన్నారు.

అంటే 25 మంత్రుల్లో ఒక ఐదుగురు పాత మంత్రులు జగన్ క్యాబినెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బాలినేని..సి‌ఎం జగన్‌కు అత్యంత సన్నిహిత నేత. కాబట్టి బాలినేని మాటలు నిజమయ్యే అవకాశాలు లేకపోలేదనే చెప్పొచ్చు. 100 శాతం కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ మంత్రివర్గంలో ట్విస్ట్‌లకు జగన్ ఎప్పుడు బ్రేక్ వేస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news