స్మశానం దగ్గర మోడీ, వైన్‌ షాప్‌ దగ్గర కేసీఆర్‌ ఫోటోలు పెట్టాలి : రేవంత్‌

-

భారత్‌ బంద్‌ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి… సీఎం కేసీఆర్‌ మరియు పీఎం మోడీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ స్మశానం దగ్గర మోడీ ఫోటో పెట్టాలని… ఎందుకంటే కరోనా చావులకు మోడీ నే కారణమని ఫైర్‌ అయ్యారు. వైన్ షాప్ దగ్గర కెసిఆర్ బొమ్మ పెట్టాలని… అయన దానికి బ్రాండ్ అంబాసిడర్ అని చురకలు అంటించారు. కొన్ని బ్యాచులు వచ్చాయని… ఏం చెప్పినా… పాల ప్యాకెట్ల తో అభిషేకం చేస్తున్నారని మండిపడ్డారు.

నిరుద్యోగులకు నోటిఫికేషన్ రావాలంటే… మందు తో అభిషేకం చేయాలన్నారు. అప్పుడైన ఉద్యోగాలు వస్తాయి… కావాలంటే ఓ క్వార్టర్.. పార్సెల్ పంపాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ పక్షాన సీఎం కెసిఆర్ బంద్ లో పాల్గొనాల్సింది పోయి… మోడీ తో కులుకుతున్నారని మండిపడ్డారు. ఇంటికి ఉద్యోగం అన్నారు.. ఊరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. కెసిఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగం వచ్చిందని… ఆయన బందువులు రిటైర్డ్ అయినా.. ఉద్యోగాలు ఇస్తాడన్నారు. . ప్రజలను మత్తులో ఉంచి… కెసిఆర్ తన పని తాను చేసుకుంటూ ఉన్నారని ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news