పత్తి రైతులకి గుడ్ న్యూస్..!

-

పత్తికి బాగా డిమాండ్ పెరిగింది. ధరలు కూడా పెరిగాయి. దీనితో పత్తి రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. కానీ సామాన్యులకి ఝలక్ తగిలింది అని చెప్పచ్చు. పండుగ సీజన్ ముందు కాటన్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. దీనికి గల కారణం ఏమిటి అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధర ఏకంగా 10 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కాటన్ ధరలు ఈ సంవత్సరం పెరగొచ్చు అని తెలుస్తోంది. అయితే పత్తి సాగు తక్కువ ఉండడమే ముఖ్య కారణం. ఇది ఇలా ఉంటే ఇక కొద్దీ రోజుల్లో దసరా పండుగ రాబోతోంది. దీనితో చాలా మంది ఎక్కువగా దుస్తుల్ని కొనుగోలు చేస్తారు. దీంతో కాటన్ దుస్తుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. దీని వల్ల టెక్స్‌టైల్ కంపెనీలకు బెనిఫిట్ ఉండనుంది.

ఇది ఇలా ఉంటే గ్రాసిమ్, రేమాండ్ వంటి గార్మెంట్ కంపెనీలకు ప్రయోజనం కలుగనుంది. అలానే గత ఏడాది పత్తి సాగుతో పోలిస్తే.. ఈసారి పత్తి సాగు 6 శాతం మేర తగ్గింది. అంచనా వేసిన ఉత్పత్తి కన్నా పత్తి తక్కువగా ఉండటం వల్ల ధరలు పెరిగాయి. 10 నుంచి 12 శాతం పైకి కదిలాయి. ప్రస్తుతం కాటన్ ధర క్వింటాల్‌కు రూ.7 వేల వరకు ఉంది. ప్రభుత్వ ధర అయితే రూ.5725. అమెరికాలో పత్తి సాగు భారీ వర్షాల వలన దెబ్బతింది. మండీలలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.6500 కు పైనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే క్వింటాల్‌కు రూ.1000 ఎక్కువగా లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news