ఏపీలోనే జనసేననే ప్రతిపక్షం..అందుకే వైసీపీ వణికిపోతుంది : నాదెండ్ల మనోహర్

-

జనసేన పీఏసీ చైర్మన్ మనోహర్… వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీని చూసి వైసీపీ వణికిపోతుందని… ఏపీ లో జనసేన పార్టీనే ప్రధాన ప్రతిపక్షమన్నారు నాదేండ్ల మనోహర్‌. మంగళ గిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యాడు.

ఈ సందర్భంగా నాదేండ్ల మనోహర్‌ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని… ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారో ఒకసారి చూడాలని చురకలు అంటించారు. ఎల్లకాలం సినిమాలు చెయ్యాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కోరుకోలేదని… డబ్బులు కోసం సినిమాలు కోసం పరితపించే వ్యాక్తి కాదన్నారు.

సినిమా ఇండస్ట్రీని కాపాడమని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారన్నారు. ప్రజలకోసం పోరాటం చెయ్యడానికి రాజకియ పార్టీ పెట్టారని స్పష్టం చేశారు. ఇది అర్థం కాని మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని… ఆయనపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని… పదవి కోసం పాకులాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news