ఫేస్‌బుక్ సేవ‌లకు అంతరాయం.. జుక‌ర్‌బ‌ర్గ్‌కు ఎంత నష్టమంటే ?

-

నిన్న రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 3 గంటల వరకు ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్ స్టాగ్రామ్‌ లు పనిచేయలేదన్న విషయం తెలిసిందే. ఈ నెట్‌ వర్క్‌ లకు చెందిన సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్ల కు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. చాలా మంది తమ ఇంటర్నెట్‌ పనిచేయడం లేదని అనుకున్నారు. కొందరైతే.. తమ ఫోనే పాడైపోయిందని వాపోయారు.

నెట్‌ వర్క్‌ ట్రాఫిక్‌ మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్ స్టాగ్రామ్‌ లు నిన్న పని చేయలేదు. అయితే.. ఎట్టకేలకు ఇవాళ ఉదయం 3 గంటల నుంచి వీటి సేవలు పునః ప్రారంభం అయ్యాయి. అయితే.. నిన్న ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇన్ స్టాగ్రామ్‌ లు సేవలు ఆగిపోవడం వల్ల ఈ సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందట.

ఫేస్‌ బుక్‌ కు దాదాపుగా 600 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగిందని సమాచారం. అలాగే.. ఫేస్‌ బుక్‌ స్టాక్‌ 4.9 శాతం తగ్గింది. అంతేకాదు.. మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వ్యక్తిగత సంపద 6 బిలియన్‌ డాలర్లకు పైగా పడిపోయింది. స్టాక్‌ స్లయిడ్‌ లో జుకర్‌ ఆస్తి విలువ 121.6 బిలియన్‌ డాలర్లకు పడిపోగా… ఆయన సంపన్నుల జాబితాలో 5 వ స్థానానికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news