MAA ELECTION : ఆ ప్యానెల్‌ కు మద్దతు ప్రకటించిన మెగాస్టార్‌ చిరంజీవి

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల్లో కాసేపటి క్రితమే.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం… చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలోని కళా కారులు మరియు నటులు ఎవరిని ఎన్నుకుంటే వారికే తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

తన అంతరాత్మ చెప్పిన విధంగా తాను ఓటు వేశానని…ఆ విషయం బయటకు చెప్పాకూడదన్నారు చిరు. మా ఎన్నికల్లో పోటీ ఈ స్థాయిలో ఉండటాన్ని స్వాగతించాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో తానే ఎవరినీ ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి.

ప్రజా స్వామ్య పద్దతిలో మా ఎన్నికలు జరగాలని కోరారు మెగాస్టార్‌ చిరంజీవి. ఎప్పుడు ఒకే లాగా అన్ని పరిస్థితులు ఉండవని… కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మారుతాయన్నారు. దానికి అనుగుణంగా సమయత్తం కావాలని పిలుపునిచ్చారు చిరంజీవి. కాగా.. మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు 150 కి పైగా ఓట్లు పోల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news