Maa Elections 2021: ‘రాత్రికి రాత్రే ఏమైందబ్బా..!’ రంగ‌మ్మ‌త్త సెటైరిక‌ల్ ట్వీట్‌

-

Maa Elections 2021: గ‌తంలో ఎన్నాడు లేని విధంగా చాలా ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు ముగిశాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ పై మంచు విష్ణు ఘ‌న విజ‌యం సాధించారు. ఈ ఎన్నికల్లో యాంక‌ర్ అనసూయ కూడా పోటీ చేశారు. ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున ఈసీ మెంబర్ గా బరిలో దిగారు. తొలుత అన‌సూయ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుంద‌ని ఆదివారం జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

కానీ మ‌రుస‌టి రోజు ఫ‌లితాలు మారాయి. ‘మా’ ఎన్నికల అధికారి విడుదల చేసిన జాబితాలో అనసూయ పేరు లేదు. మంచు విష్ణు ప్యానెల్ కు చెందినవారు 10 మంది , ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారు 8 మంది ఉన్నారు. దీంతో అన‌సూయ షాక్ కి గురైంది.

నిన్న రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ సెటైరిక‌ల్ ట్వీట్‌ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ మ‌రో ట్వీట్ వేసింది. అసలు, 600 పైచిలుకు ఓట్లు లెక్కించడానికి రెండ్రోజుల సమయం అవసరమా? అని సందేహం వ్యక్తం చేశారు అన‌సూయ .

Read more RELATED
Recommended to you

Latest news