హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం : షూటింగ్ పరికరాలు దగ్ధం

-

హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్ ఈ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే… ఈ ఘోర అగ్ని ప్రమాదం హిమాయత్ సాగర్ లో ఉన్న సినిమా షూటింగ్ పరికరాల గోదాంలో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… ఆ సినిమా షూటింగ్ పరికరాల గోదాంలో… భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదం ఇవాళ ఉదయం 12 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో… హిమాయత్ సాగర్ పరిధిలోని పోలీసు లకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అక్కడి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు… ఘటనా స్థలానికి పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది.

ప్రస్తుతం ఆ గోదావరి లో చెలరేగుతున్న మంటలను పై సిబ్బంది అదుపుచేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా షూటింగ్ కు సంబంధించిన సామాగ్రి… దగ్ధం అయింది. అయితే ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా ? లేదా ? మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news