హోమ్ మంత్రిగా రోజా…ఆ ఛాన్స్ ఉందా?

-

ఏపీలో మంత్రివర్గ విస్తరణపై అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి… ఇప్పటికే 100 శాతం మంత్రివర్గంలో మార్పులు జరగడం ఖాయమని తెలిసిపోయింది…అంటే ఇప్పుడున్న 25 మంత్రుల స్థానంలో మరొక 25 మంది కొత్తగా మంత్రివర్గంలోకి రానున్నారు. అయితే మంత్రులుగా ఛాన్స్ కొట్టేయాలని అందరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక మహిళా కోటాలో ఛాన్స్ దక్కించుకోవాలని పలువురు లేడీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు.

ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు….హోమ్ మంత్రిగా మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పుష్పశ్రీ వాణిలు ఉన్నారు. వీరి ప్లేస్‌లో మరో ముగ్గురు మంత్రులు రానున్నారు…అయితే వీరి ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేయాలని పలువురు లేడీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. రోజా, విడదల రజిని, జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీ చరణ్, రెడ్డి శాంతి, భాగ్యలక్ష్మి, ఉండవల్లి శ్రీదేవి లాంటి వారు పదవులు ఆశిస్తున్నారు.

అయితే ఇందులో ఎవరికి పదవులు దక్కుతాయో క్లారిటీ లేదు. కాకపోతే రోజాకు మంత్రిగా ఛాన్స్ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అలాంటప్పుడు ఆమెకు సుచరిత నిర్వర్తిస్తున్న హోమ్ మంత్రి బాధ్యతలు అప్పగిస్తారా? లేక వేరే బాధ్యతలు అప్పగిస్తారా? అనేది క్లారిటీ లేదు. అయితే సామాజికవర్గాల పరంగా సుచరిత ఎస్సీ కోటాలో మంత్రి అయ్యారు కాబట్టి, ఆ కోటాలోనే మంత్రి పదవి దక్కించుకునేందుకు జొన్నలగడ్డ పద్మావతి, ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు.

కానీ శ్రీదేవికి మంత్రి పదవి రావడం కష్టమే అని తెలుస్తోంది. ఇక లక్కీ ఛాన్స్ జొన్నలగడ్డ పద్మావతికే ఉంది. శింగనమల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మావతికి ఎస్సీ మహిళా కోటాలో హోమ్ మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. మరి చూడాలి ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయి…ఎవరికి హోమ్ మంత్రి పదవి దక్కుతుందనేది.

Read more RELATED
Recommended to you

Latest news