SAMMATHAME MOVIE : రొమాంటిక్ గా “సమ్మతమే” ఫస్ట్ గ్లింప్స్..

-

“రాజావారు రాణి గారు” ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం… వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా అనంతరం ఎస్ ఆర్ కళ్యాణమండపం చేశాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో ప్రియా జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవలె ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం” సమ్మతమే” సినిమా చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. సమ్మతమే సినిమా గోపీనాథ్ రెడ్డి  దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో కలర్ ఫోటో ఫేం చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇవాళ విడుదలైన.. ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. హీరో కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ చాందిని చౌదరి మధ్య రొమాంటిక్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ తాజా అప్డేట్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news