సిరిసిల్లలో చంద్ర బాబు బొమ్మ పెట్టుకుని కేటీఆర్ గెలిచాడు : రేవంత్

-

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. మరోసారి మంత్రి కేటీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ చాలా విషయాలు మాట్లాడుతున్నారని… సిరిసిల్ల లో కేటీఆర్ చంద్ర బాబు బొమ్మ పెట్టుకుని గెలిచాడని ఆరోపించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కెసిఆర్ మధ్య ఆధి పత్య పోరు లో వచ్చినవే హుజూరాబాద్ ఎన్నికలు అని నిప్పులు చెరిగారు.

ప్రజల సమస్యల కోసం ఈటల రాజేందర్‌ రాజీనామా చేయలేదని ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. సొంత పార్టీ నాయకులకు కట్నాలు చెల్లించే సంస్కృతిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ..బీజేపీ లు ప్రవేశ పెట్టాయని మండిపడ్డారు. ఎన్నికలు..ఫిరాయింపుల తోనే తెలంగాణ రాజకీయం గడుస్తుందని నిప్పులు చెరిగారు.

బీజేపీ సీసాలో..ఈటల అనే పాత సారాయి చేరిందని..ఎద్దేవా చేశారు. బాలుముర్ వెంకట్ నాన్‌ లోకల్‌ అయితే… గజ్వేల్ లో కెసిఆర్ కూడా నాన్‌ లోకల్‌ అని.. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ లు నాన్‌ లోకల్‌ కాదా..? అని ఫైర్‌ అయ్యారు. పోలీసు శాఖ రెండుగా చీలిపోయిందని.. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news