పట్టాభి వ్యాఖ్యల తో ఏపీ రాజకీయాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. పట్టాభి ఎపిసోడ్ నేపద్యంలో… తెలుగుదేశం పార్టీ మరియు వైసిపి పార్టీల నేతలు ఒకరిపై ఒకరు… మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అలాగే.. ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ పై టిడిపి ఫిర్యాదు చేయగా.. తాజాగా వైసీపీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. ఇవాళ టిడిపి పై ఎంపి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టలని చూస్తున్నారని అమిత్ షా కు ఫిర్యాదు చేశానని.. చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ మీడియా కు చెప్పారు. జగన్ మాట్లాడుతున్న భాష ఎలా ఉందో అలా నేర్చుకోవడానికి చంద్రబాబు కోసం ఓ స్కూల్ ఏర్పాటు చేయాలని చురకలు అంటించారు.
అమిత్ షా అపాయింట్మెంట్ కోసం టిడిపి రాజ్యసభ ఎమ్.పి ప్రాధేయపడడాన్ని నేను చూశానని.. అమిత్ షాను కలవడానికి మేము పోటీపడడం లేదన్నారు. తమ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు కాబట్టే హోంమంత్రికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చి మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్లు కోరి భంగపడ్డారని ఎద్దేవా చేశారు. టిడిపి నేతలను రెచ్చగొట్టి చంద్రబాబు అసభ్య పదజాలంతో దూషణలను ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు.
——