కోడలిని కిడ్నాప్ చేసిన మేనమామ..కారణం తెలిసి పోలీసులు షాక్..!

-

డబ్బుల కోసం సొంత మేనమామ కిడ్నాపర్ గా మారాడు. మేనకోడలును కిడ్నాప్ చేసి 50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అమ్మాయిని విడిచి పారిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూరు లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. బాగల్కోట్ నవనగర లో సునీత అనే వివాహిత నివాసముంటోంది. సునీతకు ఓం అనే కుమారుడు కృతిక అనే ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. కృతిక అన్నతో కలిసి బుధవారం ట్యూషన్ కి వెళ్లి ఇంటికి వస్తుండగా ఓ కారులో వచ్చి మేనమామ మరో ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారు.

కృతిక అన్న తన చెల్లిని విడిచి పెట్టాలని ఎంత వేడుకున్నా ఆమెను విడిచి పెట్టలేదు. బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లారు. అనంతరం సునిత కు ఫోన్ చేసి కృతికను విడిచి పెట్టాలంటే 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన సునిత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా గాలింపులు మొదలుపెట్టారు. దాంతో భయపడిన కిడ్నాపర్లు కృతిక ను తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలి పారిపోయారు. పోలీసులు దుండగులను మరియు మేనమామను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేయడానికి గల కారణాలను ప్రశ్నించగా జూదం ఆదే అలవాటు ఉందని… జూదం ఆడేందుకు డబ్బుల కోసమే కృతికను కిడ్నాప్ చేశానని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news